సీఎం రేవంత్ రెడ్డి పై డీకే అరుణ సీరియస్..!

-

తెలంగాణలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పై ఇటు బీఆర్ఎస్.. అటు బీజేపీ పార్టీలు విమర్శిస్తున్నారు.

తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీరియస్ అయ్యారు. వ్యక్తిగతంగా మాట్లాడుతూ.. అవమానిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం పదవీ.. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చి గెలుస్తారా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు అయిందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news