రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టేది ఆయన పార్టీలోని నల్లగొండ బాంబ్, ఖమ్మం బాంబ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం నల్లగొండలో జరిగిన ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అయ్యా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మానవ బాంబు అయితా అంటున్నావ్.. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకు లేదన్నారు. మీ ప్రభుత్వానికి ఆపద బీఆర్ఎస్ పార్టీతో.. మాతో లేదన్నారు.
డేంజర్ నల్లగొండ బాంబ్, ఖమ్మం బాంబుతోనే ఉందన్నారు. ఏక్ నాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్లు చెబుతున్నారన్నారు. వెంకట్ రెడ్డి ఇప్పటికే నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్లి నేనొస్తా.. నేనొస్తా అని చెవిలో గుసగుస పెడుతున్నాడన్నారు. మీ పక్కనే డేంజర్ గాళ్లు ఉన్నారని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.