Congress : దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే మొదటి విడత పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ తమ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది.
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ ఇద్దరి చేతుల మీదుగా కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. ఇందులో బడుగు బలహీనవర్గాలకు సంక్షేమం లక్ష్యంగా కీలక అంశాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి ఆఫర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది. బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా పథకాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి ఏ అంశాలు ఉంటాయో ఇవాళ మధ్యాహ్నం లోపు తెలుస్తుంది.