లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో గోవా, మధ్యప్రదేశ్, దాదర్‌లోని 6 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి ప్రవీణ్ పాఠక్‌కు, మొరెనా నుంచి సత్యపాల్ సింగ్ సికర్వార్‌కు టికెట్ దక్కింది. ఇప్పటి వరకు 13 జాబితాలు విడదల చేసిన కాంగ్రెస్ తాజాగా 6 అభ్యర్థులతో 14వ జాబితాను ప్రకటించింది.
మధ్యప్రదేశ్ లో మొరెనా నుంచి సత్యపాల్ సింగ్ సికార్వర్, గ్వాలియర్లో ప్రవీణ్ పాఠక్, ఖాండ్వా నుంచి నరేంద్ర పటేల్ పోటీ చేయనున్నారు. ఇక, గోవా నార్త్ నుంచి రమాకాంత్ ఖలప్, గోవా సౌత్ నుంచి కెప్టెన్ విరియాటో ఫెర్నాండెజ్ లను ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ నుంచి అజిత్ రాంజీభాయ్ మహ్లాను కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేసింది. తాజా జాబితాతో కలిసి కాంగ్రెస్ ఇప్పటివరకు 240 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించింది. కాగా, మధ్యప్రదేశ్లోని 29 స్థానాలకు గానూ 28 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. ఖజురహో స్థానాన్ని ఎస్పీకి కేటాయించింది.