ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబుది : సీఎం వైఎస్ జగన్

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రకాశం జిల్లా ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు పేరు చెబితే ఒక పథకమైనా గుర్తొస్తుందా అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ‘మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. సంక్షేమం చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు అని అన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో మీ బిడ్డ కనిపిస్తాడు. వాలంటీర్లను చంద్రబాబు ఆంబోతులంటూ కించపరిచాడు అని మండిపడ్డారు.ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబుది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

రాష్ట్రంలో గొప్ప అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ’13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించాం. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిష్ మీడియం బడులు ఏర్పాటుచేశాం అని తెలిపారు.కొత్తగా 4 సీపోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణంలో ఉన్నాయి అని పేర్కొన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శరవేగంగా పూర్తవుతోంది.కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నెలకొల్పాం’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news