మళ్లీ సీఎం అవ్వగానే నా మొదటి సంతకం దానిపైనే – సీఎం జగన్

-

మళ్లీ ముఖ్యమంత్రి అవ్వగానే నా మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పునః ప్రారంభించేందుకే అంటూ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…గతంలో కూటమి నేతలు 2014 లో జతకట్టినప్పుడు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు..మోసం చేసే వాళ్ళను నమ్మొద్దన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా మార్పు తెచ్చామని.. చంద్రబాబు హామీలు లక్షా నలభై వేల కోట్లు దాటుతుందని వివరించారు.

When I become CM again, my first signature is on it said CM Jagan

గతంలో ఎన్నికలకు ముందు రూ.1000 పెన్షన్ ఇచ్చేవారని… ఇప్పుడు మీ బిడ్డ 3000 వేలు ఇస్తున్నాడని చెప్పారు. గతంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే.. ఇప్పుడు 66 లక్ష మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు సీఎం జగన్‌. దేశంలో ఎక్కడ ఇంటికీ ఇచ్చే పెన్షన్ లేదని పేర్కొన్నారు సీఎం జగ న్. ఏటా 24 వేల కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నాం..పెన్షన్ ఇవ్వటంలో మనతో పోటీ పడే రాష్ట్రాలు లేవన్నారు. రేపు పెన్షన్లు నాలుగు వేలు చేస్తాం, ఐదు వేలు చేస్తాం అని కూటమి నేతలు చెబుతారు..నేను చెప్పనివి కూడా చాలా చేశానని గుర్తు చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news