నేను ఎక్కడున్నా..కొడంగల్ నా గుండె చప్పుడు : సీఎం రేవంత్ రెడ్డి

-

కొడంగల్ నియోజకవర్గ ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కొడంగల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.మహబూబ్‌నగర్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిని 58 వేల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు . ‘నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో డీకే అరుణ మంత్రి పదవి అనుభవించారని అన్నారు. ఇప్పుడు బీజేపీలోనూ కీలక పదవిలో ఉన్న ఆమె.. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

డీకే అరుణ వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని, కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్‌లో రూ.4 వేల కోట్లతో నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని మాట్లాడుతున్నారు.. సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ఓడించాలా? అని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్.. కొడంగల్‌లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిర్మించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news