వాలంటీర్లకు రూ.10వేల జీతం ఇస్తామని చంద్రబాబు హామీ.. సీఎం జగన్ కౌంటర్

-

వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామన్న చంద్రబాబు నాయుడు హామీపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.’ఇలాగైనా జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు.పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ‘మేమంతా సిద్ధం’ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ… మొన్నటిదాకా వాలంటీర్ల కథ తేలుస్తాం అన్నారు. వాలంటీర్లు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారని విమర్శించారు.. వాలంటీర్లు అమ్మాయిల ట్రాఫికింగ్ చేస్తున్నారని దత్తపుత్రుడని,ఇప్పుడు వారిని మెచ్చుకుంటున్నారు.. ఇంతకన్నా నా ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఏం కావాలి’ అని వైఎస్ జగన్ తెలిపారు.అన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే జన్మభూమి కమిటీ సభ్యుల్ని వాలంటీర్లుగా తీసుకొస్తారని , వాళ్లకు దోచిపెట్టేందుకే రూ.10వేలు జీతం ఇస్తాననే హామీ ఇచ్చాడని ఆరోపించారు. ‘వృద్ధులకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షను చంద్రబాబు ఆపించారు. ఇప్పుడు గాలి ఎదురు తిరగడంతో మళ్లీ మోసపు హామీలిస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2014లో టీడీపీ, బీజేపీ, దత్తపుత్రుడు కలిసి మోసం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలి’ అని వైఎస్ జగన్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news