దివంతగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ సింగ్ ఖర్సా(45) పంజాబ్ ఫరీద్ ఎంపీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.కోట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇందిరాగాంధీని చంపిన ఇద్దరు నిందితుల్లో బియాంత్ సింగ్ ఒకరు.
సరబ్‌జీత్ సింగ్ 2004లో బఠిండా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో ఆయనకు అనూహ్యంగా 1,13,490 ఓట్లు వచ్చాయి. 2007లో బదౌర్ నుంచి, 2009లో బఠిండా నుంచి, 2014లో ఫతేగఢ్ సాహిబ్ నుంచి పోటీ చేసి కూటమి చెందాడు.
2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనకు రూ. 3.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఇతని తల్లి బిమల్ కౌర్, తాత సుచా సింగ్ 1989లో వరసగా రోపర్, బఠిండా నుంచి ఎంపీలు గా గెలుపొందారు.ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ సాదిఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ తరుపున ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్ బరిలో ఉన్నారు. వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, పంజాబీ జానపద సింగర్ హన్స్‌రాజ్ హన్స్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.