3 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణంపై మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంకల్ప్ పత్ర పేరుతో ప్రజాకర్శక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.14 ప్రధాన హామీలతో కూడిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోడీ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మానవ హితం కోసం బీజేపీ దూరదృష్టితో ఆలోచిస్తుందని తెలిపారు.

పేదలు, మహిళలు, యువత, రైతులను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశామని ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలలో నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని.. రానున్న ఐదేళ్లలో మరో 3 కోట్ల నూతన గృహాలు నిర్మి్స్తామని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ హ్యా్ట్రిక్ కొట్టడం ఖాయమని.. ప్రధాని మోడీ మరోసారి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలోనూ బీజేపీ డబుల్ డిపాజిట్ సీట్లు సాధిస్తుందని జోష్ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news