Kanguva : కంగువ మూవీ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్

-

శివ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ .పాన్ వరల్డ్ మూవీగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మూవీ పది భాషల్లో విడుదల కానుంది.సూర్య 5 విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను మరింత పెంచాయి. ఇవాళ తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. సూర్య ఓవైపు వారియర్గా కత్తి పట్టుకుని.. మరోవైపు స్టైలిష్ లుక్లో ఉన్న పోస్టర్ విడుదల చేసి 2024లోనే ఈ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు.స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కంగువ లో దిశాపటాని హీరోయిన్గా నటిస్తుంది .బాబీ డియోల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news