ఈడీ తనను అరెస్ట్ చేయడం, రిమాండ్ కి తరలించడాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. తాజాగా ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈనెల 24 లోపు ఆ పిటిషన్ పై స్పందించాలని అందులో సూచించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి కోర్టు జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. ఈ కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉంటున్నారు.