IPL 2024 : చెలరేగుతున్న హెడ్.. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

 

చినస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మొత్తం 7 సిక్సులు, 4 ఫోర్లతో 69 పరుగులు చేశారు. 273 స్ట్రైక్ రేట్తో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. మరో ఓపినర్ అభిషేక్ 22 బంతుల్లో 34 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 8.3 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెడ్ 30 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్ గ ఉన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news