IPL 2024 : సెంచరీతో విజృంభించిన హెడ్… భారీ స్కోరు దిశగా సన్ రైజర్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

చినస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆర్సీబీతో పోరులో ట్రావిస్ హెడ్ ధనాధన్ ఇన్నింగ్ ఆడుతున్నారు.కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మొత్తం 7 సిక్సులు, 4 ఫోర్లతో చేసిన హెడ్ చేశాడు.అర్థ సెంచరీ తర్వాత కూడా సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డ హెడ్ 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 8 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం 11.3 ఓవర్లలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 150 దాటింది.మరో ఓపేనర్ అభిషేక్ 22 బంతుల్లో 34 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Read more RELATED
Recommended to you

Latest news