తెలంగాణ ప్రభుత్వ హాస్టల్స్ లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనల మీద మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇక వివరాల లోకి వెళితే.. భువనగిరి గురుకుల హాస్టల్ లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరువకముందే ఇంకో ఫుడ్ పాయిజన్ ఉదంతం చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రంలో కేజీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థకి గురై ఆస్పత్రిలో చేరారు ఇటువంటి నిర్లక్ష్య వైఖరి పనికిరాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే బాధ్యత విద్యార్థులకి మెరుగైన చికిత్స అందించాలని ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కాంగ్రెస్ కి డిమాండ్ చేశారు.