తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికలు దగ్గరకి వస్తున్న నేపథ్యంలో… రైతులకు న్యాయం చేసేలా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారట. మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. మార్చి మాసంలో కురిసిన ఆకాల వర్షాలకు 15,814 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.
మొత్తంగా 15246 మంది రైతులు నష్టపోయినట్లు సమాచారం. అయితే ఆ రైతులందరికీ ఎకరాకు పదివేల రూపాయల చొప్పున… పరిహారం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఎలక్షన్ కమిషనర్ ఆమోదం తెలపగానే అన్నదాతల అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులు పంట నష్టం తుది అంచనాలు సిద్ధం చేస్తున్నారు.