నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల అని వెల్లడించారు సీఎం జగన్. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ అని స్పష్టం చేశారు. వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో జిల్లాలో అందరికీ తెలుసు అన్నారు. వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారు… వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి అని నిలదీశారు. చిన్నాన్నకు రెండో పెళ్లి అయింది వాస్తవం.. సంతానం ఉన్నది వాస్తవం అని స్పష్టం చేశారు సీఎం జగన్.
పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..పులివెందులలో అభివృద్ధికి మార్పునకు మూలం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు.. పులివెందులలో ఏముంది అని చెప్పండి అని అడిగితే, ఏమీ లేదో చెప్పండి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చానని తెలిపారు సీఎం వైఎస్ జగన్.
వైఎస్ఆర్ వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నాం…ఆ మహానేతకు ఎవరు వారసులనేది చెప్పాల్సింది ప్రజలు కాదా అంటూ చురకలు అంటించారు.వైఎస్ఆర్ చనిపోయాక ఆయన కుటుంబం మీద కుట్రలు చేసింది ఎవరు.. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఎఆర్ లో చేర్చింది ఎవరు? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ అనే పేరు లేకుండా చేయాలని కోరుకుంటున్నది ఎవరు? అని ఆగ్రహించారు సీఎం జగన్.