మేము అధికారంలోకి వచ్చాక రాజోలును స్మార్ట్ సిటీ గా చేస్తాం : పవన్ కళ్యాణ్

-

భీమ్లా నాయక్ సినిమా, వకీల్ సాబ్ సినిమా అడ్డుకోవాలని చూసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాని నిలిపివేస్తే నేను వెళ్లి జగన్ ను బ్రతిమిలాడతాను అనుకున్నాడు, అవసరమైతే ఉచితంగా ఇంటర్నెట్ లో వదిలేసే వ్యక్తిని నేను, నా ఆత్మగౌరవాన్ని తగ్గించుకోను అని తెలిపారు. రాజోలు వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సఖినేటిపల్లి – నరసాపురం మధ్యలో వశిష్ఠ వారధి నిర్మిస్తాం, కోనసీమకు రైల్వే మార్గం తీసుకొస్తాం అని హామీ ఇచ్చారు.టూరిజం అభివృద్ది చేస్తాం.ప్రభుత్వం సంపద సృష్టించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అప్పుడే ప్రజలకు అప్పు చేయకుండా పథకాలు అందించగలం, మేము సంపద సృష్టించే విధానాలు తీసుకొస్తాం, సంక్షేమం తో పాటుగా అభివృద్ది చేసి చూపిస్తాంకేంద్రంలో మాట్లాడి DCI డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసేలా చూస్తాను, దిండి రిసార్ట్స్ కేరళ తరహా టూరిజం డెవలప్ చేస్తాం, అన్నా చెల్లెలు గట్టు టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం.రాజోలు ను ONGC స్మార్ట్ సిటీగా చేస్తాం అని ముందుకు వచ్చినా సరే వైసిపి ప్రభుత్వం ముందుకు రాలేదు, మేము అధికారంలోకి వచ్చాక రాజోలు ను స్మార్ట్ సిటీ గా చేస్తాం అని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news