ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా..

-

నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 39,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధరల వద్ద నిలిచి 36,220 రూపాయలు గా ఉంది. అయితే, వెండి ధరలో మార్పు లేదు. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,700 వద్ద నిలింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,200 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా 37,000 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి 46,700 రూపాయల వద్ద నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news