ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి, ముస్లిం మహిళల జీవితాలలో వెలుగు నింపిన ఘనత మోడీది : ఈటల రాజేందర్

-

కరోనా కాలంలో ఇతర దేశాల నాయకుల్లాగా కన్నీళ్లు పెట్టుకోకుండా దేశ ప్రజలకు ధైర్యం చెప్పి, అందరికీ ఉచితంగా ఆహారం, వైద్యం అందజేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని ఈటెల రాజేందర్ కొనియాడారు. అలాగే ఉచితంగా దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇప్పించడమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను అందించారు అని గుర్తు చేశారు.మాజీ సైనికులతో నాగోలులో జరిగిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మోదీని హిందూత్వ వాది అని ,అయోధ్య రాముని పేర్లతో ఓట్లు దండుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ఆయన జాతీయ వాది.ముస్లిం మహిళల పాలిట శాపంగా మారిన ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి, వారి జీవితాలలో వెలుగు నింపారు అని ఈటెల రాజేందర్ అన్నారు.

మిలట్రీలో 40 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఒన్ ర్యాంక్- ఒన్ పెన్షన్ విధానాన్ని మోడీ తీసుకొచ్చారు.మెడికల్ గ్రాంటులను నాన్ పెన్షనర్లకు 20 వేల రూపాయల నుండి 50 వేల రూపాయలకు పెంచారు. సైనికులకు, వారి కుటుంబాల కోసం ఎన్నో పథకాలు, గ్రాంట్లు ఇస్తున్నారు.మోదీ గారికి, నాకు మధ్యవర్తి అక్కరలేదు.దేశంలో అత్యధికంగా సైనికులు నివసించే నియోజక వర్గం మల్కాజ్ గిరి.మీ సమస్యలపై, నియోజక వర్గ సమస్యలపై నేరుగా ప్రధాని మోదీతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.రేపు ఎన్నికల అనంతరం రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మళ్లీ ప్రధానిగా మోదీయే ఎన్నిక కాబోతున్నారని మీకు తెలుసు.ఎన్ని కుట్రలు చేసయినా గెలవాలని ఆలోచించే మోసపూరిత పార్టీలకు బుద్ది చెప్పే విధంగా ఎంపీగా నాకు ఓట్లు వేసి, బీజేపీని గెలిపించాలని, అందరూ మీ ఓట్లను సద్వినియోగం చేసుకోవాలని ఈటెల రాజేందర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news