బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

-

బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు వెల్లువెత్తాయి. బోస్ తనను వేధింపులకు గురి చేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేశారు. కోల్కతా రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగం విషయమై గవర్నర్ బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు స్పందించకపోవడం గమనార్హం.

అయితే ఈ ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. సత్యం గెలుస్తందని .. కల్పిత కథనాలను చూసి తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు. ఇలా తనను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే, గాడ్ బ్లెస్ దెమ్. కానీ, బంగాల్లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఆపలేరని బోస్ పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్పై వస్తున్న ఆరోపణలపై టీఎంసీ నాయకురాలు శశి పంజా స్పందిస్తూ.. తాము దిగ్భ్రాంతికి గురయ్యామని.. సందేశ్‌ఖాలీకి వెళ్లి మహిళల హక్కుల గురించి మాట్లాడిన ఆయన, ఇప్పుడు చాలా అవమానకరమైన ఘటనకు పాల్పడటం బాధాకరమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news