రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా

-

న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ గురువారం రోజున రణరంగంలా మారింది. మూడు వారాలుగా పాలస్తీనాకు అనుకూలంగా అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న సంస్థల ఆర్థిక సాయం తీసుకోవద్దని ఈ ఆందోళన సందర్భంగా విద్యార్థులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రోజున యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ఏంజెలిస్‌ (యూసీఎల్‌ఏ)లోకి ప్రవేశించిన పోలీసులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారుల గుడారాలను తొలగించారు.

పదుల సంఖ్యలో విద్యార్థులను అరెస్టు చేశారు. అంతకుముందు ప్రాంగణాన్ని విడిచి వెళ్లాలని నిరసనకారులను లౌడ్‌ స్పీకర్లలో హెచ్చరించారు. వారు బేఖాతరు చేయడంతో హెల్మెట్లు, రక్షక కవచాలు ధరించి భారీసంఖ్యలో యూనివర్సిటీలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య భారీ స్థాయిలో తోపులాట జరిగింది. 15 మందికి గాయాలవ్వగా.. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ఆందోళనలు మొదలైన ఏప్రిల్‌ 18 నుంచి ఇప్పటి వరకు దాదాపు 2000 మందిని అరెస్టు చేసినట్లు అనధికార సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news