తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎన్నికల రోజు వరకు కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుందని.. రాబోయే 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ అన్ని జిల్లాలకు వర్షం వచ్చే సూచన ఉంది. ముఖ్యంగా ఉత్తర, ఉత్తర ఈశాన్యా జిల్లాలకు ముఖ్యంగా వర్ష ప్రభావం కాస్త ఎక్కువగా ఉంది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ , జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముంది.
ఈరోజు వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ముందు రోజు.. ఎన్నికల రోజు అంటే 12, 13 తేదీల్లో చల్లటి వాతావరణం ఉంటుంది. ఎన్నికల రోజున కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న నారాయణ పేట్ లో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డి, వికారాబాద్, నారాయణఖేడ్, మెదక్ , రంగారెడ్డి నిన్న వర్ష ప్రభావం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా క్యూమలోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం పూట వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో వీస్తాయి. కొన్ని చోట్ల 40 నుండి 50 కి .మీ ఉండే ఛాన్స్ ఉంది.
తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల తో కూడిన వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. నిర్మల్ , నిజామాబాద్, జగిత్యాల లో 41,42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈదురుగాలులు, వర్షాల సమయం లో రైతులు అప్రమత్తంగా ఉండాలి.హైద్రాబాద్ లో మేఘావృతమైన వాతావరణం, చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉంది. మే మూడు, నాలుగో వారంలో మరోసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక జూన్ రెండో వారంలోనే వర్షా కాలం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది.