పిఠాపురంలో ప్రచారం పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!

-

మెగాస్టార్ చిరంజీవి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మే 09న పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.   కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. తన సేవలు గుర్తించి కేంద్రం ఈ అవార్డు ప్రధానము చేయడం ఎంతో సంతోషంగా వుంది. ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం తన అభిమానులని చిరంజీవి తెలిపారు. వారు చూపిన ప్రేమాభిమానాల వల్లే తనకి ఈ అవార్డు లభించిందని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే ..పవన్ కల్యాణ్ కు మద్దతుగా తాను పిఠాపురం ప్రచారానికి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని చిరంజీవి తెలిపారు. ‘నేను ప్రచారానికి రావాలని నా తమ్ముడు ఎప్పుడూ కోరుకోలేదు. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో లేను. రాజకీయాలకు అతీతంగా ఉన్నా. తమ్ముడితో పాటు నేను ఉన్నానని చెప్పేందుకే ఇటీవ వీడియో విడుదల చేశా. మా తమ్ముడి అభివృద్ధి, రాజకీయ ఎదుగుదలను మేము అందరం కోరుకుంటాం’

 

Read more RELATED
Recommended to you

Latest news