ప్రపంచపటం మీద భారత ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి మోడీ : ఈటల రాజేందర్

-

వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భగా.. నల్లగొండ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అతి తక్కువకాలంలో ప్రజలచేత ఛీ కొట్టించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. అబద్దాల హోరు అలవవి కానీ హామీలనీ బురిడీ కొట్టించారు. చీ అని ప్రజలు అంటున్నారు. కెసిఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ ను గెలిపించారు తప్ప వీళ్ళని చూసి కాదు. మళ్ళీ ఎండి పోతున్నపంటలు, కాలిపోతున్న మోటార్లు దర్శనమిస్తున్నాయి అని మండిపడ్డారు. 10 శాతం కమీషన్ లేనిది బిల్లులు చెల్లించడం లేదు. దందాలు, పైసల వసూళ్లు తప్ప నిజాయితీ లేదు అని అన్నారు.

దీనిని అర్ధం చేసుకోగలిగిన వారు పట్టభద్రులు.  తర్కించుకొని ఓటు వేయండి. ఎవరు ప్రజల పక్షాన ఉంటారో తెల్సుకొని ఓటు వేయండి అని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎప్పుడు ఒకవైపే ఉండరు.. మంచి నాయకున్ని, పార్టీని చూసి ఓటు వేస్తారు. 2014 లో కూడా కాంగ్రెస్ అనేక చిల్లర ఆరోపణలు చేసారు.. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ల రద్దు అంటూ అబద్దపు ప్రచారం చేసారు. దేశంలో ఉన్న వారందరు భారతీయులే అని నిన్ననే మోడీ చెప్పారు. కాంగ్రెస్ కి నిజమైన ప్రజాబలం లేక అబద్ధాలని నమ్ముకున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ కు కంచుకోట అయిన యూపీ లో ఇప్పుడు బీజేపీ కి మద్దతు పలుకుతుంది. కాంగ్రెస్ పాలన స్కామ్ ల మయం . ఇందిరాగాంధి ఇచ్చిన గరీబీహటావో నినాదమే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇస్తున్నారు. దేశంలో పేదరికానికి కారణమే కాంగ్రెస్. మోడీ పాలనా వారి తప్పులన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారు ఈటల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news