ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం స్టేట్ పాలిటిక్స్ లో ఎవరు అధికారం చేబడుతారనే చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్కు పడాల్సిన ఓట్లన్నీ చంద్రబాబుకు పడ్డాయని చింతా మోహన్ అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఎన్నో ఆశలతో ఉందని అవి అన్ని ఆవిరైపోతాయని అన్నారు. ఈ సారి కూడా తామే అధికారంలోకి వస్తున్నామని వైసీపీ నేతలు చెప్పడం.. కేవలం వారి ఊహాగానాలేనని తెలిపారు. ఎన్నికల వేళ వైసీపీ రూ.4-5 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇక ఈ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.