జగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే : బోండా ఉమా

-

జగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత  బోండా ఉమా పేర్కొన్నారు. తాాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సిట్ రిపోర్టును వెంటనే డీజీపీ బయట పెట్టాలి. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  ముఖ్యంగా  రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సస్పెండైన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్ట్ చేయాలి. అధికారుల సస్పెన్షన్లపై పోలీసు సంఘం నోరు మెదపాలి. వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయకపోవడం దారుణం అన్నారు.  హింస సృష్టించిన వైసీపీ నేతలపై నామమాత్రపు కేసులు పెట్టడంపై విచారణ చేపట్టాలి. ఇంకా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news