బ్రెయిన్ ఈటింగ్‌ అమీబాతో చిన్నారి మృతి

-

కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి ‘బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా’తో మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మే1, 10 వ తేదీల్లో స్థానికంగా ఉన్న చెరువులోకి ఆ చిన్నారి స్నానానికి వెళ్లింది. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కలుషితమైన ఆ నీటిలో ఫ్రీ లివింగ్ అమీబా ఆమె ముక్కునుంచి శరీరంలోకి వెళ్లిందని.. ఆ తర్వత మెదడుపై తీవ్ర ప్రభావం చూపిందని వైద్యులు చెప్పారు. ఆమెకు వచ్చిన వ్యాధిని సరైన సమయంలో కుటుంబ సభ్యులు గుర్తించకపోవడం వల్ల వైద్య చికిత్స ఆలస్యంగా జరిగిందని.. అందుకే ఆ బాలిక మృతి చెందినట్లు వెల్లడించారు.

పరాన్నజీవీ కాని బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబా వల్ల ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన నీటిలో ఉండే ఈ జీవి.. మనుషుల ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఇది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మెదడు క్రమంగా పనిచేయడం మానేస్తుంది. ఒకరకంగా దీన్ని మెదడును తినే అమీబాగా పిలుస్తారు. ఈ వ్యాధి వచ్చిన వారికి ముందుగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. వెంటనే చికిత్స చేయకపోతే ఈ వ్యాధికి గురైన బాధితుడు మరణించే ప్రమాదం ఉంటుంది. 2017, 2023లో కూడా కేరళలో ఇలాంటి కేసులు వెలుగుచూశాయి.

Read more RELATED
Recommended to you

Latest news