జూన్ 09న చంద్రబాబు ప్రమాణ స్వీకారం : టీడీపీ నేతలు

-

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన అనంతరం రాష్ట్రంలో గెలుపు, ఓటముల పై చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం పై ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ తమదే గెలుపు అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.  ఈ తరుణంలో పలు సర్వేలు కూడా గెలుపు ఎవరిదో తేల్చి చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే  పలువురు టీడీపీ నేతలు కాబోయే సీఎం చంద్రబాబు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ నేతలు అన్నారు. వైజాగ్ లో గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణం రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సర్వేలన్నీ కూటమికి అనుకూలంగానే ఉన్నాయని.. జూన్ 4వ తేదీ తర్వాత వైసీపీ పని అయిపోతుంది. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని చూడబోతుంది. బటన్లు నొక్కారు కానీ అకౌంట్లలో డబ్బులు పడటం లేదు అంటూ ఎద్దేవా చేశారు. సీఎస్ ను మారిస్తే అన్నీ సర్దుకుంటాయి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది జూన్ 4న తేలనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news