ఉత్త‌రాంధ్ర ఓట‌ర్లు వైసీపీకే జై కొట్టారా… వైసీపీ అంత‌ర్గ‌త స‌ర్వేలో విస్తుపోయే నిజాలు

-

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. ఎవ‌రు అధికారంలోకి రాబోతున్నారు అనేది ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. అయితే ప్ర‌స్తుతం ఏపీలో ఓ సెంటిమెంట్ బాగా వినిపిస్తోంది.  స‌త్తా చాటిన పార్టీకి అధికారం ద‌క్కుతుంద‌నే సెంటిమెంట్ చాన్నాళ్ళ నుంచి కోన‌సాగుతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15, విజయనగరంలో 19, శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 34 స్థానాలకు గాను.. వైసిపి 28 చోట్ల విజయం సాధించింది. అప్పుడు ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఇదే క్ర‌మంలో జూన్ 4వ తేదీన రానున్న ఫ‌లితాల‌లో ఎవ‌రు ఎక్కువ సీట్లు సాధిస్తార‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా సాగుతోంది.దీనిపై ఎవ‌రికి వారు లెక్క‌లు వేసుకుంటున్నారు. అధికారం మాదే అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేసేసుకుంటున్నారు.

ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టిడిపి గెలుచుకుంది.అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2019 ఎన్నికల్లో వైసిపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని రెండు పార్టీలు భావిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీకే అనుకూల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.విశాఖ రాజధాని, సంక్షేమ పథకాలే గ‌ట్టెక్కిస్తాయ‌నివైసిపి ఆశతో ఉంది.

గత ఎన్నికల్లో 34 స్థానాలకు గాను.. వైసిపి 28 చోట్ల విజయం సాధించింది. టిడిపి కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. విజయనగరం జిల్లాలో అయితే అసలు ఖాతా తెరవలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి సీట్లు త‌గ్గ‌డం ఖాయమని ప్రచారం జరుగుతోంది.2014లో టిడిపికి 25 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు దానిని అధిగమిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో జనసేన తో పొత్తు టిడిపికి మైన‌స్ కానుంద‌నే వాద‌న వినిపిస్తోంది.బ‌ల‌మైన టీడీపీ నేత‌ల‌ను కాద‌ని చివ‌ర‌లో జ‌న‌సేన నాయ‌కుల‌కు టిక్కెట్ కేటాయించ‌డంతో కూట‌మికి చాలా మంది నేత‌లు దూర‌మ‌య్యారు.ఇది ఆ పార్టీకి వ్య‌తిరేక ఫ‌లితాలు ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది.గ‌త ఎన్నికల్లో విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే టిడిపి పరిమితం అయింది.అప్పుడు అందులో ఒక్క‌టి మాత్ర‌మే ఆ పార్టీకి ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో వైసిపి వైట్ వాష్ చేసింది. 9 నియోజకవర్గాలను హస్త గతం చేసుకుంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ధీమాతో చెబుతోంది. ఈసారి కూడా అదే కొన‌సాగుతోంద‌ని అంటున్నారు.ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను గెలిచి తీరుతామని వైసీపీ నేత‌లు ధీమా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే టిడిపి పరిమితం అయ్యింది. ఈసారి ఆ రెండు కూడా వైసీపీ ఖాతాలోకి వ‌చ్చేస్తాయ‌ని అంటున్నారు. మొత్తానికైతే వైసీపీ చెప్తున్న లెక్క‌లు కూటమి నేత‌ల‌ను టెన్ష‌న్‌కు గురిచేస్తున్నాయి. వైసీపీ చేప‌ట్టిన అంత‌ర్గ‌త స‌ర్వే కూట‌మి పార్టీల్లో నైరాశ్యం అలుముకునేలా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news