“జయ జయహే తెలంగాణ” గీతంపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. సుమారు ఆరు నిముషాల నిడివి ఉన్న అందె శ్రీ గీతం “జయ జయహే తెలంగాణ” గీతాన్ని కేవలం రెండు నిమిషాలకే కుదించాలని రేవంత్ నిర్ణయం తీసుకుందని బీఆర్‌ఎస్ పార్టీ వెల్లడిస్తోంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి గురించి ఉన్న చరణాలు కత్తిరించాలి అని సూచనలు చేసిందట రేవంత్ సర్కార్. అలా చేస్తే అసలు పాటకు అర్థం లేకుండా పోయే పరిస్థితి ఉందని సమాచారం.
ఒక గొప్ప స్ఫూర్తి గీతాన్ని ఇట్లా కత్తిరించడం అందె శ్రీకి, తెలంగాణకు అవమానం అంటున్నారు తెలంగాణవాదులు. గతంలో పాట నిడివి కుదించాలని కేసీఆర్ అడగగా అలిగి నా పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా వాడుకోవొద్దు అని చెప్పారు అందె శ్రీ. కానీ ఇప్పుడు సుమారు ఆరు నిముషాల నిడివి ఉన్న అందె శ్రీ గీతం “జయ జయహే తెలంగాణ” గీతాన్ని కేవలం రెండు నిమిషాలకే కుదించాలని రేవంత్ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.