రిజల్ట్ తరువాత ఆ పార్టీ ఉండదు…. వేణు స్వామి సంచలన కామెంట్

-

ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి మరోసారి సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు.వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ ఎదో ఒక విధంగా వార్తల్లో ఉండే ఆయన మరోసారి మొహమాటం లేకుండా ఓ రాజకీయ పార్టీ భవితవ్యంపై కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. సినీనటుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన భవిష్యత్తు ఏంటో క్లారిటీ ఇచ్చేశారు.పవర్ స్టార్ గా పేరున్న పవన్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో పోటీ చేయగా ఓటమి ఎదురైంది.ఇప్పుడు టిడిపి , బిజెపి లతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈసారి ఎలాగైనా సరే గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పిఠాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు.హోరాహోరీగా జరిగిన పోరులో పోలింగ్ శాతం కూడా బాగా పెరిగింది.ఈ క్రమంలో గెలుపు పక్కా అంటున్నారు జనసైనికులు.ఇదే టైమ్ లో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై వేణుస్వామి సంచలన కామెంట్లు చేశారు.

ఏపీ ఎన్నికలలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హవా కనిపించింది. కానీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదగలేరని అన్నారు ఈ స్వామి. ఎన్నికల రిజల్ట్ తర్వాత ఒక పార్టీ ఏపీలో ఉండదు అంటూ జాతకాన్ని చెప్పేశారు. ముఖ్యంగా చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదన్నారాయన.దీంతో ఈసారి నారా వారికి రాజయోగం లేదని నిర్మొహమాటంగా తేల్చేశారు.అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.ఏపీ రాజకీయాలపై జాతకాలు చెప్పడమే కాదు ఎవరికి రాజయోగమో క్లారిటీ ఇచ్చేసరికి జనాల్లో మరింతగా చర్చలు జరుగుతున్నాయి.పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇలా ఉండబోతోంది అంటున్నారా ఇక జనసేన పార్టీ కనపడదు అంటున్నారా అనేది జనాలకు అర్థం కావటం లేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుడదు అంటూ బలంగా నినాదం వినిపించి కూటమి పొత్తుకి శాయశక్తులా కృషి చేసిన పవన్….వైయస్సార్ పార్టీని గద్దె దించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు వేణు స్వామి ఇలాంటి కామెంట్లు చేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది.ఇక జూన్ 4 తర్వాత వచ్చే ఫలితాలను బట్టి సినిమా షూటింగుల్లో పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్.వేణు స్వామి చెప్పినట్లు పవన్ పరిస్థితి తయారవుతుందా లేక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ రచించిన వ్యూహాలు అమలవుతాయా అనేది జూన్ 4న తేలుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news