ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అన్ని జిల్లాలకూ విస్తరిస్తామనీ, అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని అంటున్న వైసీపీ అందుకు తగ్గట్టుగానే… మూడు రాజధానులు, నాలుగు ప్రాంతాలుగా ఏపీని పాలనా పరంగా విభజించబోతున్నట్లు అందరికీ తెలిసింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని, ఇదే తమ ప్రభుత్వ ధ్యేయమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే తాము మూడు రాజధానుల ప్రతిపాదన చేశామని ఆయన తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు.
25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన:
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చారిత్రక నిర్ణయమని విజయసాయి రెడ్డి అన్నారు. 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నారని ఆయన తెలిపారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమన్న ఆయన… రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.