‘అసురన్’ రీమేక్ లో వెంకీ సరసన నటించబోయేది ఆమేనా…..??

-

టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 సినిమాలో నటించారు. ఎంతో అత్యద్భుత విజయాన్ని అందుకున్న ఆ సినిమా, కెరీర్ పరంగా వెంకటేష్ కు మంచి బ్రేక్ ని ఇచ్చిందనే చెప్పాలి. మరి ఆ విధంగా ఈ ఏడాది బిగినింగ్ లో హిట్ కొట్టిన వెంకీ, ఇటీవల తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకీ మామ సినిమాలో నటించి మరొక మంచి సక్సెస్ ని అందుకున్నారు.

 

ఇకపోతే ఈ సినిమా తరువాత వెంకటేష్, తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ లో నటించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్రహ్మోత్సవం సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్ క్యారెక్టర్స్ పోషించిన కాజల్,తొలిసారి ఈ సినిమాలో డీ గ్లామరస్ రోల్ లో నటించడానికి సిద్ధం అయినట్లు సమాచారం.

ఈ మేరకు ఇటీవల దర్శక, నిర్మాతలు కాజల్ ని సంప్రదించగా ఆమె అందుకు ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. అలానే ఆమెతో పాటు ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి అయిందని, మరికొద్దిరోజుల్లో ఈ విషయమై సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, వెంకీ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కాజల్ కొట్టేసినట్టే మరి…..!!

Read more RELATED
Recommended to you

Latest news