ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ నేతలు వేసుకున్న పందెం తాలూకా అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కదిరి సీట్ వైసీపీ గెలుస్తుందని నల్లచెరువు మండల నాయకుడు, టీడీపీ గెలుస్తుందని గాండ్లపెంట వైసీపీ నాయకుడు పందెం వేసుకున్నారు. ఈ పందెం విలువ రూ.10 లక్షలు కావడం విశేషం.
ఇక అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన సెగ్మెంట్ పిఠాపురం. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ గెలుస్తారని తన యావదాస్తిని పందెం కాస్తానని, డౌట్ ఉంటే ఎవరైనా కాగితాలు తీసుకుని రావొచ్చునని వర్మ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.