అసైన్డ్ భూములు 20 ఏళ్ల తరువాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు : విశాఖ కలెక్టర్

-

అసైన్డ్ భూములకు అతి తక్కువ ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చిన జిల్లా విశాఖేనని కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా శిలక్షల ఎకరాల భూమి ప్రీ హోల్డ్ సర్టిఫికెట్లకు అర్హత పొందగా.. విశాఖ జిల్లాలో 702 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు వెల్లడించారు.

అసైన్డ్ భూములు పొందిన రైతులు 20 ఏళ్లు గడిచాక ఎవరికైనా, ఎప్పుడైనా అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. వీఎంఆర్డీయే ల్యాండ్ పూలింగ్ కింద విశాఖలో చాలా వరకు అసైన్డ్ భూములు తీసుకోగా.. ఎలాంటి పత్రాలు లేని ఇద్దరు వ్యక్తులు కోర్టుకు వెళ్లారని తెలిపారు. ప్రభుత్వ భూమిని రక్షించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు. మరో వైపు ఏపీలో ఎన్నికల ప్రచారం సమయంలో ల్యాండ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అధికార, ప్రతిపక్షల నేతల మధ్య మాటల యుద్ధమే కొనసాగడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news