వైసీపీ అభ్యర్థి పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు..!

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఇప్పటివరకు ఎన్నికలు జరిగాయి. దీంతో అన్ని దశల్లో పోలింగ్ జరిగిన తరువాతనే ఎన్నికల కౌంటింగ్ కి అనుమతి ఇచ్చింది ఈషీ. జూన్ 04న దేశవ్యాప్తంగా ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం మినహా మిగతా రాష్ట్రాల ఫలితాలు జూన్ 04న విడుదల కానున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు నిన్ననే విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా చంద్రగిరిలో ఫాం 17-A  ఓటర్ల జాబితా పరిశీలన, ఇతర డాక్యుమెంట్లు మరోసారి పరిశీలించాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిండది. దీంతో పాటు నియోజకవర్గంలోని నాలుగు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయ స్థానం తిరస్కరించింది. జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది సుప్రీంకోర్టు. 

Read more RELATED
Recommended to you

Latest news