హైదరాబాద్లో రేపు 144 సెక్షన్ అమలు

-

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు వేళయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. గొడవలకు ఆస్కారం లేకుండా రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. గుంపులుగా తిరుగుతూ అల్లర్లకు తావివ్వకుండా ఆంక్షలు విధించారు. వేలాది మంది పోలీసు సిబ్బంది నిఘా ఉంచనున్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతా విధానం అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అల్లర్లకు అవకాశం లేకుండా జూన్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధుల్ని మాత్రమే అనుమతించనున్నారు. రాజధానిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాలున్నాయి. ఒకే చోట పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట  సగటున వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా వెంటనే అడ్డుకునేలా అడుగడుగునా సిబ్బందిని మెహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news