ఉత్కంఠ పోరులో మాదవీ లత పై విజయం సాధించిన ఓవైసీ

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద పార్లమెంట్ స్థానం నుంచి కూడా దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేయగా.. బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేశారు. ఎంఐఎం, బీజేపీ మధ్య పోటా పోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఎవ్వరూ విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది.

ముఖ్యంగా మాధవీలత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఒవైసీకి ముచ్చెమటలు పట్టించింది. మొదటి 5 రౌండ్లలో ఆధిక్యత కొనసాగించింది. ఆ తరువాత మెల్లమెల్లగా తన ఆధిక్యాన్ని కోల్పోయింది. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దన్ ఒవైసీ బీజేపీ అభ్యర్థి మాధవీలత పై 3,15,811 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అంతకు ముందు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఒవైసీ 2004, 2009, 2024, 2019లో ఎంపీగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాధవీ లతకు 2,97,031 ఓట్లు లభించాయి. తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news