శర్వానంద్​కు కొత్త ట్యాగ్.. ఇక నుంచి ఛార్మింగ్ స్టార్

-

సపోర్టింగ్ రోల్స్​లో కనిపించి నెమ్మదిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు టాలీవుడ్​లోనే టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగాడు శర్వానంద్. శర్వా సినిమా అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేలా పేరు తెచ్చుకున్నాడు. మంచి స్టార్​డమ్ సంపాదించుకున్నాడు. నేచురల్ యాక్టింగ్​తో పక్కింటి కుర్రాడిగా కనిపించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఎన్నో హిట్​లు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న శర్వాకు ఇప్పటి వరకు ఎటువంటి ట్యాగ్ లేదు. అయితే ఇకపై శర్వాను ఫ్యాన్స్ ఓ కొత్త టైటిల్​తో పిలవనున్నారు. అదేంటంటే?

శర్వానంద్ తాజాగా ‘మనమే’ అనే ఫ్యామిలీ ఎంటర్​టైనర్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ జూన్ 7వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఇందులో ‘మనమే’ నిర్మాత ఈ యంగ్ హీరోకు ​ఛార్మింగ్ స్టార్ అనే టైటిల్​ ఇచ్చారు. సినిమా టైటిల్ క్రెడిట్స్​లోనూ అదే వాడారట. ఇది విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news