విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

-

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రత్యేక విమానంలో తిరుమల బయలుదేరి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అనంతరం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేయకున్నారు. గన్నవరం నుండి కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఇంద్రకీలాదిపై ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారితో పాటు టీడీపీ నేతలు కూడా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం చంద్రబాబు దంపతులకు పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదం అందించి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

అనంతరం ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. స్కిల్ సెన్సస్ ప్రక్రియ, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. వీటికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news