రాజకీయాల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ది విలక్షణ వ్యక్తిత్వం. ఎవరిని ఏ విధంగా డీల్ చెయ్యాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయంగా ఆయన బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా సరే వ్యతిరేకి౦చాలన్నా, వాళ్ళను దగ్గర చేసుకోవాలన్నా సరే ఆయనకు ఆయనే సాటి. వామపక్షాలతో గతంలో స్నేహం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళను తిట్టి హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో వాళ్ళను కొనియాడి మద్దతు తీసుకున్న చాణక్యం కెసిఆర్ కే సొంత౦ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
బిజెపితో సంబంధాల విషయంలో కూడా దాదాపు అంతే, కాంగ్రెస్ వస్తే తనకు ఇబ్బందని భావించిన ఆయన, ఏ విధంగా బిజెపికి మద్దతు ఇవ్వాలో ఆ విధంగా ఇస్తూ రెండు జాతీయ పార్టీలకు తాను దూరం అని చెప్పారు. ఇప్పుడు ఆయనకు బిజెపితో అవసరం వచ్చి పడింది. దీనితో భారతీయ జనతా పార్టీ కెసిఆర్ ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు కాస్త ఎక్కువగానే చేస్తుంది. ఇది కెసిఆర్ కి కలిసి వచ్చే అంశమే. అయితే గత ఆరు నెలల నుంచి బిజెపి కెసిఆర్ ని బలహీనపరిచే విధంగా ప్రయత్నాలు చేసింది అనేది వాస్తవం.
ఇప్పుడు కెసిఆర్ తో సంధికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో కెసిఆర్ తో ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న తమిళనాడు కి చెందిన గవర్నర్ నరసింహన్ బిజెపి పెద్దలకు ఆయన గురించి చెప్పారట. కెసిఆర్ తో అంత ఈజీ కాదు, అంచనా వేయలేని రాజకీయ నాయకుడు, ఏ సందర్భంలో కూడా మీరు అంచనా వేయడం అనేది సాధ్యం కాని పని, కాబట్టి ఆయనతో దూకుడుగా వెళ్ళకుండా ఉంటేనే మంచిది, తెలంగాణా సమాజంలో ఆయనకు ఒక గౌరవం, అలాంటి వ్యక్తిని దాటి మీరు తెలంగాణాలో,
రాజకీయం చేయడం అనేది సాధ్యం కాదు, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అంటూ బిజెపి పెద్దలకు ఆయన నూరిపోసారట. ఇప్పటికిప్పుడు మీరు తెలంగాణాలో ఎం చేసినా సరే అక్కడి ప్రజలకు ఆత్మగౌరవం మీద దెబ్బ తగిలినట్టు భావిస్తారని, అది కెసిఆర్ కి అనుకూలంగా మారుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది అని సూచించారట నరసింహన్. తాను పదేళ్ళు కెసిఆర్ ని చూశానని, అయిదేళ్ళు దగ్గరగా చూశానని కాబట్టి హనకు తెలుసు అని, జాగ్రత్తగా ఉండమని చెప్పారట.