రుషికొండ భవనాలపై గుడివాడ అమరనాథ్ సంచలన ప్రకటన

-

రుషికొండ భవనాలపై గుడివాడ అమరనాథ్ సంచలన ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ..ఋషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ సొంత భవనాల్లగా రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు…రుషికొండ భావనలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని కోరారు. నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించామన్నారు.

gudivada amarnath

ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి… రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భావనలను వినియోగించుకోవాలని డిమాండ్‌ చేశారు. రుషికొండపై కట్టిన భవనాల్లో జగన్ మోహన్ రెడ్డి ఏమీ ఉండరు.. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై త్రీ మెన్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారన్నారు. ఆ కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారని క్లారిటీ ఇచ్చారు. టిడిపి నేతలు… వైఎస్ జగన్ మీద వారి కుటంబం మీద బురద జల్లాలని చూడడం ఎంతవరకు సమంజసం అంటూ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news