తెలంగాణకు హోంమంత్రి కావాలి.. బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్..!

-

రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, నిత్యం ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలతో శాంతిభద్రతలు క్షీణించాయని అధికార పార్టీపై బీఆర్ఎస్ నాయకులు ఇటీవల గళం విప్పింది. గడిచిన వారం వ్యవధిలో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన ఘటన, హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్ అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపడం లాంటి ఘటనలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయింది. ఇక పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య రెండు పార్టీల నడుమ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

ప్రజలకు న్యాయం జరిగేలా అండగా నిలబడాల్సిన పోలీసులే తోటి మహిళ సిబ్బందిపై అత్యాచారానికి ఒడిగడితే.. ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎండగడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు ఓ హోంమంత్రి కావలంటూ బీఆర్ఎస్ ట్విట్టర్ వేదిక ఓ సైటైరికల్ పోస్ట్ ట్విట్ చేసింది ‘తెలంగాణకు హోం మంత్రి కావలెను..! తొమ్మిదిన్నరేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల శాంతిభద్రతలు క్షీణించాయి. ఘరణలు, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు తెలంగాణకు హోంమంత్రి లేడు.. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదు. అందుకే వెంటనే తెలంగాణకు హోంమంత్రి కావలెను అంటూ బీఆర్ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news