ఈ ఏడాదిలో చిట్టచివరి, గ్రహణం గురువారం ఉదయం 8.03 గంటలకు మొదలై ఉదయం 11.11 గంటలకు ముగిసింది. మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా, మోక్షకాలం ఉ.11.11 గంటలు. మూడు గంటల పాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌తోపాటు ఆసియాలోని పలుదేశాల్లో కనువిందు చేసింది. సూర్యగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. భారత్‌తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, ఒమన్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మరియానా దీవులు, గువామ్‌లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమిచ్చింది.
ఇక సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలను బుధవారం రాత్రి నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే సూర్యగ్రహణం ముగిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అర్చకులు సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. ఆలయాల శుద్ధి అనంతరం దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. ఇక జనాలు తమ నివాసాలను కూడా శుద్ధి చేసుకుంటున్నారు.