అభిమానిని తోసేసిన బాడీగార్డ్.. క్షమాపణలు చెప్పిన నాగార్జున

-

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయణ్ను చూసేందుకు ఓ అభిమాన దగ్గరకు వెళ్లిగా నాగార్జున బాడీగార్డ్ ఆ అభిమానిని పక్కకు నెట్టేశాడు.  సదరు అభిమాని దివ్యాంగుడు కావడం.. అయినా అతడిని బాడీగార్డ్ పక్కకు నెట్టేయడం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

అయితే ఇదంతా ఆ సమయంలో నాగార్జున దృష్టికి వచ్చినట్లు వీడియోలో కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేసి ట్రోల్ చేయగా.. ఇది కాస్త నాగార్జున దృష్టికి వెళ్లింది. దీంతో దీనిపై ఆయన స్పందించారు. ‘‘ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు. సదరు వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను’’ అని పోస్టు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news