కాంగ్రెస్‌ లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు…కేసీఆర్‌ సంచలన నిర్ణయం

-

కాంగ్రెస్‌ లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళుతున్న తరుణంలో…కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరనుంది. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది బిఆర్ఎస్ పార్టీ.

The BRS party will approach the Supreme Court regarding the disqualification of the MLAs joining the Congress

ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి మూడు నెలలు పూర్తికానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించింది పార్టీ. దానం నాగేందర్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది బిఆర్ఎస్.

అటు కాంగ్రెస్‌ లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళుతున్న తరుణంలో..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని… 2004-06 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news