సొంత పార్టీలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ధిక్కారం పెరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఇవాళ వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సొంత పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా ఉన్నారని, సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆరుగురు పార్టీ ఫిరాయించారని ప్రస్తుతం కేసీఆర్ బలం 33గా ఉందన్నారు. అదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేవలం 26 మంది ఎమ్మెల్యే బలం మాత్రమే ఉందని అన్నారు.
ఆయన వ్యవహారం నచ్చక సొంత పార్టీలో 38 మంది ఎమ్మెల్యేలు ఆయనను వ్యతిరేకిస్తున్నారని,అందుకే తన బలాన్ని మరింత పెంచుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిధులు, మంత్రి పదువులు, కాంట్రాక్టుల ఆశచూపి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని టచ్ చేసే ముందు పార్టీలో ఉన్న సొంత ఎమ్మెల్యేలే తనను వ్యతిరేకిస్తున్నారో ఒకసారి రేవంత్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.