మొబైల్ వినియోగదారులు సీఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలి

-

సాధారణంగా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో మొబైల్ ఫోన్ ను పోగుట్టుకుంటారు. అది ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్బంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను గుర్తించేందుకు  ప్రత్యేకంగా ఓ పోర్టల్ ని రూపొందించారు. ఈ పోర్టల్ ని ఉపయోగించినట్టయితే మొబైల్ ను సులభంగా గుర్తించవచ్చు. అది ఎలాగో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

మొబైల్ వినియోగదారులు సీఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. చోరికి గురైన 22 పోగొట్టుకున్న 22 మొబైల్ ఫోన్లను బాధితులకు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బాధితులకు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఈఐఆర్ పోర్టల్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ ఆధ్వర్యంలో   లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్, ఎస్సై రాఘవేంద్ర స్వామి, సిబ్బంది రవికుమార్, వల్లపు కృష్ణ, సాగర్, కాంతి సాయి ఆధ్వర్యంలో టెక్నికల్ గా విచారణ జరిపి 22 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బాధితులకు అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news