పరుగులు చేసిన కూడా తనను బెంచ్‌కే పరిమితం చేశారు.. యువ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

-

దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న కారణంతో టీమిండియా బ్యాట్స్మన్ ఇషాన్‌ కిషన్‌ను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.క్రమంగా జట్టుకు కూడా దూరమయ్యాడు.గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాపై ఇషాన్ కిషన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌కు విశ్రాంతినివ్వడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. పరుగులు చేస్తున్నప్పటికీ తనను బెంచ్‌కే పరిమితం చేశారని ,ఇది క్రీడలో సహజమే అయినప్పటికీ ఏదో తప్పు జరుగుతుందని అనిపించిందని, అందుకే విరామం తీసుకోవాలనుకున్నట్టు వెల్లడించాడు. ట్రావెలింగ్ అలసట కూడా ఓ కారణమని తెలిపారు.

అయితే, తనను తన కుటుంబం, కొంతమంది సన్నిహితులు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేదు అని ఆవేదన చెందాడు. ‘తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనే నిబంధన ఉంది. నన్ను దేశవాళీ ఆడమనడం సమంజసంగా అనిపించలేదు అని అన్నారు. నేను క్రికెట్ ఆడే పరిస్థితులు లేకనే అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం తీసుకున్నా. అలాంటప్పుడు నన్ను దేశవాళీ ఆడమనడం సరైందేనా?. క్రికెట్ ఆడే పరిస్థితే ఉంటే బ్రేక్ ఎందుకు తీసుకుంటాను అని ప్రశ్నించారు.గతంలో ఏం జరిగిందనే దాని గురించి తాను బాధపడటం లేదని, రాబోయే టోర్నీల కోసం ఫిట్‌గా ఉండటంపైనే దృష్టిపెట్టినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news